Sam Konstas: ఇకపై బుమ్రాతో పెట్టుకోను.. కొన్స్టాస్ 11 h ago
ఆస్ట్రేలియా యువ బ్యాటర్ సామ్ కొన్స్టాస్ కు తప్పు తెలిసొచ్చింది. భారత ప్రధాన పేసర్ బుమ్రాను రెచ్చగొడితే ఎలా ఉంటుందో బాగా అర్థమైంది. అందుకే మరోసారి అలాంటి ఘటన జరిగితే, బుమ్రాతో పెట్టుకోనని తెలిపాడు. బోర్డర్- గవాస్కర్ సిరీస్ చివరి టెస్టు తొలి రోజు ఆఖరి ఓవర్ వేసేందుకు బుమ్రా సిద్ధమవగా.. ఖవాజా సమయాన్ని వృథా చేశాడు. దీంతో బుమ్రా అసహనం వ్యక్తం చేశాడు. అప్పుడు మధ్యలో కొన్స్టాస్ దూరడంతో ఘర్షణ వాతావరణం నెలకొంది.
ఆ ఓవర్ చివరి బంతికి ఖవాజాను ఔట్ చేసి.. కొన్స్టాస్ వైపు బుమ్రా కోపంగా చూశాడు. “పోటీలో ఉండటాన్ని ఇష్టపడతా. ఒక అడుగు ముందే ఉండాలనుకుంటా. అది (బుమ్రాతో ఘటన) నాకో మంచి పాఠం. వాళ్లకు మరో ఓవర్ వేసేందుకు అవకాశం లేకుండా కాస్త సమయం వృథా చేద్దామని ప్రయత్నించా. కానీ చివరకు బుమ్రానే నెగ్గాడు. ఆ ఘటన మళ్లీ జరిగితే ఆ సమయంలో బహుశా ఏం మాట్లాడకుండా ఉంటా. కచ్చితంగా అతనో ప్రపంచ స్థాయి బౌలర్. ఈ సిరీస్‌లో 32 వికెట్లు పడగొట్టాడు" అని కొన్స్టాస్ తెలిపాడు.